Loading Posts...
Jhansi
|
February 17, 2026
తమిళనాడును పాలించిన తెలుగు రాజులు - విశ్లేషకుడు 'కుడవాయిల్ బాలసుబ్రహ్మణ్యం'
![]() |
| మన్నార్గుడి రాజగోపాల స్వామి - విజయరాఘవ నాయక్ అలంకారం |
కుడవాయిల్ బాలసుబ్రమణియన్... యాభై ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న విశిష్ట చరిత్రకారుడు. ఆయన తంజావూరుని పరిపాలించిన తెలుగు రాజుల గురించి రాసిన రెండు తమిళ గ్రంథాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగువారిగా మనం గర్వించదగ్గ అంశాలు ఎన్నో ఉన్నాయి వీటిల్లో. తంజావూర్ నాయకర్ వరలారు (తంజావూరు నాయకరాజుల చరిత్ర), తమిళ్ మన్నన్ కోనేరిరాయన్ (తమిళరాజు కోనేరిరాయన్) అనే ఆ రెండు పుస్తకాల చిరు పరిచయం ఇది...
